ఎన్నికల ప్రచారం ముగిసింది.. పోలింగ్ సమాప్తం అయ్యింది. ఇంకేముందీ నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నట్లు ఉన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఎన్నికల ప్రచారం ముగిసింది.. పోలింగ్ సమాప్తం అయ్యింది. ఇంకేముందీ నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నట్లు ఉన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంట్లో పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్. దీంతో సరదాగా ఇంట్లోనే కాలక్షేపం చేశారాయన. ఈ సందర్భంగానే కొడుకును హగ్ చేసుకున్న ఫొటోను షేర్ చేశారు.
Read Also : ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసిన చంద్రబాబు : వైసీపీ అనుమానం
13 సంవత్సరాలకే మీ కుమారుడు ఎత్తులో మిమ్మల్ని మించిపోతే.. ఓ హగ్ కాకుండా ఇంకేం కోరుకుంటారు అంటూ క్యాప్షన్ పెట్టారు. ట్విట్టర్ లో ఈ పోస్టు వైరల్ అయ్యింది. తండ్రిని మించిన తనయుడు.. రాజకీయాల్లో మీకంటే బాగా రాణిస్తాడు.. ఆల్ ద బెస్ట్.. అంటూ నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.
జాతీయ పర్యావరణ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు కేటీఆర్ కుమారుడు హిమాన్ష్.