ప్రధానికి కేటీఆర్ బర్త్డే విషెస్:మోడీజీ..మీరు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి
- veegam team
- Published on- September 17, 2019 / 05:42 AM IST
సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్రమోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. మోడీ 69వ పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు.
ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో, సంతోషంతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో కేటీఆర్ ప్రధానిని కలిసి ఓ మొక్క గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ఫోటోను ట్విట్టర్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా ప్రధాని మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ దేశ వ్యాప్తంగా సేవా సప్తాహ్ (వారోత్సవాలను) కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే.
