సుదీర్ఘ కాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారికే టైటిల్ హక్కు: KTR

Ktr:ఆస్తులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న టైటిల్ సమస్యకు సొల్యూషన్ ఇస్తున్నట్లుగా మంత్రి KTR చెప్పారు. ఏళ్ల తరబడి నివాసముంటూ ప్రభుత్వానికి పన్ను, బిల్లులు చెల్లిస్తున్న పేదలకే టైటిల్ హక్కు ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలనుసారం పనులు మొదలయ్యాయని అన్నారు. పట్టణాల్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయా జిల్లాల పరిధిలోని పురపాలక సంఘాలవారీగా సమీక్ష నిర్వహించారు.




ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఇందులో మంత్రి కేటీఆర్ పేద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాల కంటే పట్టణాల్లో ప్రజలకు ఆస్తులకు సంబంధించి టైటిల్‌ సమస్యలను అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్నవారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా పెద్దఎత్తున ఉపశమనం కలిగించగలిగాం. కొన్ని కారణాలతో ఇంకా పరిష్కారంకాని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.

మున్సిపాలిటీల్లోని పేదల కోసం కూడా ప్రభుత్వం త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అంగుళం భూమిని రికార్డులకు ఎక్కించాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలి. వ్యవసాయేతర ఆస్తులను 15 రోజుల్లో ధరణి వెబ్‌సైట్‌లో నమోదుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దసరా నుంచి ధరణి వెబ్‌పోర్టల్‌ ప్రారంభమవుతుందని చెప్పారు.




ఆస్తుల నమోదును పర్యవేక్షించాలి
ధరణి వెబ్‌సైట్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలి మంత్రి కేటీఆర్‌ సూచించారు. దీంతోపాటు పట్టణాల్లో ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలను సేకరించాలి. పట్టణాల్లో ఏళ్ల తరబడి నివాసముంటూ కరెంట్‌ కనెక్షన్‌, ఇంటి పన్ను చెల్లిస్తున్నవారికి ప్రయోజనం చేకూరుస్తామని చెప్పారు.

పేదలకు వారికి చెందిన ఆస్తులపై సంపూర్ణ హక్కులు దక్కడంతో భవిష్యత్‌లో క్రయవిక్రయాలకు ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న పట్టణాల్లో నెలకొన్న రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలను కేటీఆర్‌ వద్ద ప్రస్తావించారు. ఇప్పటికే వారివద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందజేశారు. మంగళవారం సాయంత్రంలోగా అన్ని సమస్యలను పురపాలకశాఖ ఇవ్వనున్నట్టు వారు పేర్కొన్నారు.




ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్నవారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా పెద్దఎత్తున ఉపశమనం కలిగించాం. అయినప్పటికీ కొన్ని కారణాలతో పరిష్కారంకాని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాం. మున్సిపాలిటీల్లోని పేదల కోసం ప్రభుత్వం త్వరలో పూర్తిస్థాయిలో, శాశ్వత పరిష్కారం చూపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అంగుళం భూమిని రికార్డులకు ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలి. అని కేటీఆర్ అధికారులకు ఆదేశించారు.