ఇటీవల ప్రవేశ బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ మొదలైంది. చర్చలో భాగంగా మొదటిరోజైన శనివారం పలు ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ కంపెనీలు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. బదులిస్తూ మహేశ్వరం, ఓల్డ్ సిటీ ఏరియాల్లో ఐటీ కంపెనీలు నెలకొల్పే ఆలోచన తమకు ఉన్నట్లు పేర్కొన్నారు.
బెంగళూరు లాంటి నగరాల్లో ఒకే చోట ఐటీ కంపెనీలు కేంద్రీకృతం కావడం వల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నాయని, ఇక్కడ అలాంటి పరిస్థితి తలెత్తకుండా నూతన విధానాలతో ఏర్పాట్లు చేపడతామని వివరించారు. ఇప్పటి వరకూ ఉన్న పశ్చిమ హైదరాబాద్ లోనే ఐటీ ఫిక్స్ అయిపోకుండా హైదరాబాద్ నలుదిశలా ఐటీ సెక్టార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
శంషాబాద్, మహేశ్వరం, ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో ఉన్న ఫాబ్ సిటీలో స్టార్టప్ కంపెనీ స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్థలం కోసం వెదుకుతున్నామని త్వరలో ఏర్పాటు చేస్తామని వివరించారు.