తెలంగాణలో కాంగ్రెస్ గలిస్తే రాహుల్‌కు బీజేపీ గెలిస్తే మోడీకి లాభం అని, అదే టీఆర్‌ఎస్ అభ్యర్ధులు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రజలు 16 సీట్లను గెలిపిస్తే వాటికి తోడుగా ఇంకా 150 సీట్లు కలుస్తాయని కేటిఆర్ అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అంటే పడని 15పార్టీలు మనతో కలుస్తాయని చెప్పారు. యూపీలో మాయావతి, అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బంగలో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఏపీలో జగన్ మనతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని కేటిఆర్ చెప్పుకొచ్చారు.
Read Also : బాబు మళ్లీ సీఎం అయితే రద్దయ్యేవి ఇవే – జగన్
మన నాయకుడు కేసీఆర్‌ను ఢిల్లీకి పంపించి దేశానికి దశ దిశ నిర్దేశించేలా చేద్దామని కేటిఆర్ అన్నారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే మంచిదని ప్రజలంతా అవకాశం ఇచ్చారని, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌కు సంబంధం లేదంటున్నారని, అది నిజం కాదని కేటిఆర్ అన్నారు. మనం 16 సీట్లు గెలిస్తే, మనకు దన్నుగా నిలిచే పార్టీలతో కలిసి కేంద్రం మెడలు వంచవచ్చునని. మన రాష్ట్ర ప్రాజెక్టులకు 90 శాతం వరకూ నిధులు తెచ్చుకోవచ్చునని చెప్పారు. ఢిల్లీలో మన బలం పెరిగితే.. రెండేళ్లలో హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు రైల్వే లైన్ వస్తుందని అన్నారు.
Read Also : డెడ్‌లైన్.. 4 రోజులే : పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా?