వీరుల త్యాగాలను మరవం : కేటీఆర్ విరాళం

  • Publish Date - February 17, 2019 / 06:32 AM IST

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై భారతదేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రతికారం తీర్చుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మరోవైపు జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస్తోంది. తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు. 

ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం ఉదయం నగరంలో ఉన్న సీఆర్పీఎఫ్ సౌత్ ఆఫీసుకు కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అమరులైన వీర జవాన్లకు కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. జవాన్ల గౌరవార్థం తన వంతుగా రూ. 25 లక్షలు, స్నేహితులు ముందుకొచ్చి ఇచ్చిన మరో రూ. 25 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన చెక్కులను సీఆర్పీఎఫ్ ఐజీ జీహెచ్‌పీ రాజుకు కేటీఆర్ అందించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.