సినిమా థియేటర్ కు బిగ్ షాక్ : 10 నిమిషాలు ఆలస్యం చేశారని పోలీస్ కేసు

హైదరాబాద్ కూకట్ పల్లిలో షాకింగ్ ఘటన జరిగింది. సమయానికి సినిమా వేయలేదని ఆగ్రహించిన ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ థియేటర్ పై కేసు

  • Publish Date - October 16, 2019 / 03:58 AM IST

హైదరాబాద్ కూకట్ పల్లిలో షాకింగ్ ఘటన జరిగింది. సమయానికి సినిమా వేయలేదని ఆగ్రహించిన ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ థియేటర్ పై కేసు

హైదరాబాద్ కూకట్ పల్లిలో షాకింగ్ ఘటన జరిగింది. సమయానికి సినిమా వేయలేదని ఆగ్రహించిన ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ థియేటర్ పై కేసు నమోదు చేశారు. సినిమా స్టార్ట్ ​చేయాల్సిన టైంలోనూ యాడ్స్ ​వేసి తమ విలువైన సమయాన్ని వృథా చేశారని.. థియేటర్ ​యాజమాన్యం, అపరేషన్​ మేనేజర్​పై కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూకట్​పల్లిలో నివాసం ఉండే వ్యక్తి అక్టోబర్ 8న కేపీహెచ్​బీ కాలనీలోని మంజీరా ట్రినిటీ మాల్​ లోని 3వ ఫ్లోర్​లో ఉన్న సినీ పోలీస్ మల్టీప్లెక్స్​కు వెళ్లాడు. సాయంత్రం 4.40 గంటలకు గోపీచంద్ చాణక్య సినిమా స్టార్ట్ ​కావాల్సి ఉంది. అయితే థియేటర్ యాజమాన్యం ఆలస్యం చేసింది. 10 నిమిషాల పాటు యాడ్స్​ వేసింది.

దీనిపై ఓ ప్రేక్షకుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు పోలీసులను ఆశ్రయించాడు. సినిమా టైమ్ లో యాడ్స్ వేసిన మల్టీప్లెక్స్ ​యాజమాన్యం, ఆపరేషన్​ మేనేజర్ పై అక్టోబర్ 8న కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమయానికి సినిమా వేయకుండా యాడ్స్ వేసి ప్రేక్షకుల విలువైన సమయాన్ని వృథా చేశారని, నిబంధనలు సైతం ఉల్లంఘించారని ఫిర్యాదులో తెలిపాడు. ఆ ఫిర్యాదుపై మంగళవారం(అక్టోబర్ 15,2019) కోర్టు నుంచి అనుమతి రావడంతో థియేటర్ పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

టైమ్ ​వేస్ట్ ​చేసి ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగించడం కరెక్ట్ కాదని ఫిర్యాదుదారుడు అన్నాడు. సినిమా టైమ్ లో యాడ్స్ వేయడం చట్ట ప్రకారం నేరం అని చెప్పాడు. అలాగే తెలంగాణ స్టేట్‍ రెగ్యులేషన్‍ యాక్ట్  ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఆరోపణలతో కూకట్‍పల్లిలోని సినీ పోలిస్‍ మల్టీప్లెక్స్ మేనేజ్‍మెంట్‍పై కేపీహెచ్‍బీ పీఎస్​లో కేసు నమోదు చేయించినట్లు ఫోరం ఎగనెస్ట్ కరెప్షన్‍ ఫౌండర్‍ విజయ్‍గోపాల్‍ తెలిపారు.

రూల్స్​ పాటించని థియేటర్‍ యాజమాన్యాలకు పోలీసులు రూ.10 వేల ఫైన్‍ వేసే అవకాశం ఉందన్నారు. సమయానికి కాకుండా 10 నిమిషాలు ఆలస్యంగా సినిమా వేసినందుకు ఓ ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సినీ థియేటర్ల యజమానుల్లో వణుకు పుట్టించింది.

దీనిపై ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తగిన శాస్తి జరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సిటీలోని చాలా థియేటర్ల తీరు ఇలాగే ఉందని..సమయానికి సినిమా వెయ్యకుండా యాడ్స్ వేసి చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రేక్షకుల టైమ్ వృథా చెయ్యడానికి వారికి హక్కు లేదన్నారు.