పక్కా ప్లాన్ తో దిశ నిందితుల మర్డర్ : లాయర్ జీఎస్ మణి

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను న్యాయవాది జీఎస్ మణి తప్పుపట్టారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. నిందితుల మర్డర్ కు సీపీ సజ్జనార్ మాస్టర్ ప్లాన్

  • Publish Date - December 11, 2019 / 01:24 PM IST

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను న్యాయవాది జీఎస్ మణి తప్పుపట్టారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. నిందితుల మర్డర్ కు సీపీ సజ్జనార్ మాస్టర్ ప్లాన్

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను న్యాయవాది జీఎస్ మణి తప్పుపట్టారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. నిందితుల మర్డర్ కు సీపీ సజ్జనార్ మాస్టర్ ప్లాన్ వేశారని ఆరోపించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ చట్టవిరుద్దంగా జరిగిందన్నారు. పక్కా ప్రణాళికతో నిందితులను చంపేశారని చెప్పారు. ఇది ఫేక్ ఎన్ కౌంటర్ అని, ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టులో అడిగామని చెప్పారు. సుప్రీంకోర్టు ఎన్ కౌంటర్ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని ఆయన చెప్పారు. రిటైర్డ్ జడ్జితో దర్యాఫ్తు జరిపించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిందన్నారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ను వ్యతిరేకిస్తూ.. జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామంది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందన్న కోర్టు.. ఢిల్లీ నుంచే రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారంది. అలాగే ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో కేసు కొనసాగుతుందని తెలిపింది. తదుపరి విచారణను గురువారానికి(డిసెంబర్ 12,2019) వాయిదా వేసింది. ఈ కేసులో ఎలాంటి వాదనలు జరగకుండానే రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం విశేషం.