హైదరాబాదీల్లో పొగ తాగని వాళ్లకే ఎక్కువగా క్యాన్సర్

హైదరాబాద్ నగరంలో మహిళలతో పాటు పొగ త్రాగని పురుషులు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు గురవుతున్నారు. దీనికి వాతావరణ కాలుష్యం, ఇతరులు చేస్తున్న ధూమపానాన్ని పీల్చడం వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. ఇటీవల విడుదలైన వివరాలను బట్టి 100లో 30మంది 30ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారే క్యాన్సర్ కు గురవుతున్నారు. వీరిలో దాదాపు 49శాతం మంది పొగ త్రాగనివారేనని కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డా.వీవీ రమణ ప్రసాద్ తెలిపారు. 

స్త్రీ-పురుషుల నిష్పత్తిలో ప్రత్యేకమైన మార్పులు వచ్చాయి. ఇటీవలి కాలంలో పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. గతంలో క్యాన్సర్ బాధితుల్లో పురుషుల కంటే మహిళల్లో తక్కువగా ఉండేవారు. నేరుగా సిగరెట్ వంటివి తాగే అలవాటు లేకపోయినా నాలుగు గోడల మధ్యలో కాల్చిన సిగరెట్ వంటి దుమ్ము ధూళి కొద్ది రోజుల పాటు ఆ పరిసరాల్లోనే ఉంటుంది. కార్ లోపల, మొక్కల ఆకులపైన ఉండి శరీర స్పర్శ ద్వారా మనుషులకు సంక్రమించే సూచనలు ఉన్నాయి. 

వీటితో పాటు గాలిలో నాణ్యత లోపించడం కూడా ప్రధాన కారణం. దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్లలో చాలామందికి ఆక్సిజన్ లోపమే కారణం. పాగ కాలుష్యం జరుగుతున్న ప్రదేశాన్ని గుర్తించి బయట, ఇంట్లో వాటికి దూరంగా ఉండటంతో వీటి నుంచి బయటపడగలమని నిపుణులు చెబుతున్నారు.