సురేష్ పరిస్థితి విషమం : మరోసారి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్న మేజిస్ట్రేట్

  • Publish Date - November 6, 2019 / 10:28 AM IST

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన సురేష్ వాంగ్మూలాన్ని మరోసారి రికార్డు చేయనున్నారు. అయితే ప్రస్తుతం సురేష్ పరిస్థితి విషమంగానే ఉంది. ఆ వాంగ్మూలానికి సహకరించలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మానసిక పరిస్థితి సరిగ్గాలేనందున సురేష్ వాంగ్మూలాన్ని మరోసారి రికార్డు చేయాలని మెజిస్ట్రేట్ భావించినట్లుగా తెలుస్తోంది.

కాసేపట్లో ఉస్మానియా ఆస్పత్రికి మేజిస్ట్రేట్ తోపాటు విచారణ అధికారి విజయ్ కుమార్ చేరుకోనున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో మేల్ వార్డులో ఇంకా సురేష్ చికిత్స పొందుతున్నాడు. అతని కండీషన్ క్రిటికల్ గా ఉందని వైద్యులు వెల్లడించారు. అతని శరీరంపై 65 శాతం పూర్తిస్థాయిలో గాయాలు అయ్యాయి. 24 గంటలు దాటిన తర్వాత శీరరానికి సంబంధించిన అబ్జర్వేషన్ చేస్తున్నారు. శరీరానికి ఎలాంటి ఇన్ ఫెక్షన్ కలగకుండా చికిత్స అందిస్తున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసులో సురేష్ ప్రధాని నిందితుడుగా ఉన్నాడు. మరోసారి అతని వాంగ్మూలాన్ని తీసుకునేందుకు మేజిస్ట్రేట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. 24 గంటలు దాటిన తర్వాత అతను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి మొదటిసారి అతన్ని విచారించినప్పుడు, మాట్లాడినప్పుడు మాత్రం మతిస్థిమితం లేకపోవడంతో పూర్తి వివరాలు వెల్లడించనందున అతన్ని మరోసారి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ నియమించిన ఏసీపీ విజయ్ కుమార్ కూడా మేజిస్ట్రేట్ తోపాటు వచ్చే అవకాశం ఉంది. అతన్ని సంప్రదించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను మాట్లాడలేని పరిస్థితి ఉంటే మాత్రం.. మొదటి సారి తీసుకున్న డెత్ ఆఫ్ డిక్లరేషన్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. మరో 48 గంటలు దాటితే తప్ప అతని హెల్త్ కండీషన్ పై క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.