ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ కు సంబంధించిన 30 నుంచి 40కేజీల సంచిని ఓ వ్యక్తి నిప్పు పెట్టి కాల్చేశాడు. వాటిలో వేల కొద్దీ ఉత్తరాలు, ఆధార్ కార్డులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం గంగిశెట్టి భిక్షపతి అనే చింతల్ నుంచి అహ్మద్‌గూడకు మద్యం మత్తులో వచ్చాడు. వచ్చేటప్పుడు లెటర్లు, ఆధార్ కార్డులు ఉన్న దాదాపు 30 నుంచి 40కేజీలు ఉండే పది సంచులను వెంటతీసుకొచ్చాడు.
అహ్మద్ గూడలోని ప్రజాసాయి గార్డెన్స్ లో వాటిని తగులబెట్టాడు. రామిడి రాజి రెడ్డి అనే వ్యక్తి 2015 మార్చిలో ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు. తన స్థలంలో ఏదో తగులబెడుతున్నారని తెలియడంతో అక్కడికి చేరుకున్నాుడు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే చాలా ప్రాంతాలకు చేరాల్సిన ఉత్తరాలు చేరలేదనే కంప్లైంట్లు వస్తున్నాయని వాటిపై విచారణ జరుపుతున్నామని అన్నారు.
కీసర ఇన్‌స్పెక్టర్ జే నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ.. చేరాల్సిన 12 సంచుల ఉత్తరాలు పోస్టాఫీసెస్ అసిస్టెంట్ సూపరిండెంట్ కు అందజేశాం. వారు ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని తెలియజేశారు.