హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు.
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు. నాంపల్లి రైల్వే ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బుధవారం (అక్టోబర్ 16, 2019) గోదావరి ఎక్స్ ప్రెస్ నాంపల్లి నుంచి వియవాడకు బయలు దేరింది. అదే సమయంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి రైలు కింద పడ్డాడు.
తీవ్రంగా గాయపడిన అతన్ని 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. అయితే చికిత్సకు తరలించే సమయంలో పోలీసులు అతన్ని వివరాలు అడుగగా తన పేరు మహేశ్ అని, ఉత్తరప్రదేశ్ కి చెందినవాడనని తెలిపాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.