వివాహితను నగ్న చిత్రాలతో బెదిరిస్తున్న వ్యక్తి…మనస్తాపంతో ఆత్మహత్య

  • Publish Date - February 8, 2020 / 11:23 AM IST

ఆడపుట్టుకలపై దాడులు..అత్యాచారాలు..అరాచకాలు..ఇలా పలు రకాలుగా జరుగుతున్న హింసలు కొనసాగుతునే ఉన్నాయి.ఎన్ని కఠిన  వచ్చినా..దుర్మార్గుల దారుణాలకు అంతులేకుండా పోతోంది. ఈ క్రమంలో ఓ మగాడి రాక్షసత్వానికి మరో మహిళ బలైపోయింది. హైదరాబాద్ నగరం.ఎస్సార్ నగర్ లోని కైలాష్ నగర్ లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఓ మహిళలను నగ్నంగా ఫోటోలు తీసి వేధిస్తుండటంతో మనస్తాపానాకి గురైన బాధిత మహిళ బలన్మనానికి పాల్పడింది. 

ప్రశాంత్ అనే వ్యక్తి వివాహం అయిన మహిళను నగ్నంగా ఫోటోలు తీసాడు. వాటిని చూపించి డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. లేదంటూ సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో పరువుపోతుందనే భయంతో బాధిత మహిళ అతడు అడిగినంత డబ్బు ఇచ్చింది.

కానీ అతను వదల్లేదు..దీంతో అతడి పీడ వదిలించుకోవటానికి తన దగ్గర ఉన్న బంగారం కూడా ఇచ్చింది. అయినా వాడి ఆగడాలు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీనిపై బాదిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.