మనోజ్ ట్వీట్ : మగాడుగా పుట్టడం దేనికి? 

  • Publish Date - February 7, 2019 / 10:48 AM IST

హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలివుడ్ హీరో మంచు మనోజ్ మధులికపై ప్రేమోన్మాది దాడి ఘటనపై స్పందించారు.  ఆడపిల్లలపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.  ‘మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి? మనిషి అనే వాడు ఒక ఆడపిల్ల మీద దాడి చేసే ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తలుచుకుంటే ఇలాంటివి ఏ నాడు జరగవు. ఆడపిల్లల్ని రక్షించాల్సిన మగాడు ఆడపిల్ల అనుభవించే నరకానికి కారకుడు ఐతే ఇంక మనం పుట్టిన దానికి అర్థం ఏమిటి??’ అని తన ట్వీట్‌లో మనోజ్ పేర్కొన్నారు. 
 

ప్రేమ పేరుతో వేధిస్తు తన ప్రేమ నిరాకరించిందని పశువులా మారిన భరత్ అనే యువకుడు మధులిక అనే అమ్మాయిపై దాడికి పాల్పడిన ఘటన నగరంలో మరోసారి కలకలం రేపింది. మధులిక  కాలేజీకి వెళుతున్న సమయంలో వెంటపడి.. కొబ్బరి బోండాల కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు 15 కత్తిపోట్లకు గురయ్యింది. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మధులిక పరిస్థితి విషమంగా ఉంది.