ఫుడ్ పారేయొద్దు : హైదరాబాద్ లో ఫీడ్ ద నీడ్ ప్రారంభం

  • Publish Date - February 14, 2019 / 10:06 AM IST

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ‘ఫీడ్‌ ద నీడ్‌’ కార్యక్రమానికి జూబ్లిహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ దాన కిశోర్‌ ప్రారంభించారు. వృధా అవుతున్న ఆహారాలను ఆకలితో ఉన్నవారికి అందించేందుకు ఫీడ్‌ ద నీడ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని కోసం హోటల్‌ యజమాన్యాలను..స్వచ్ఛంద సంస్థలను కమిషనర్‌ కోరాగా..40 వేల ఆహార ప్యాకెట్లను ఇవ్వడానికి ఆయా యాజమాన్యాలు ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఫీడ్ ద నీట్ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామని మేయర్‌ బొంతు రామ్మోహన్ తెలిపారు. స్వచ్చందంగా ఆహారాన్ని అందించేవారి కోసం ఓ  యాప్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
 

బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఎవ్వరూ ఆకలితో అలమటించకూడదనీ..ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.5కు భోజనం పెడుతున్నామనీ..కనీసం ఆ రూ.5 కూడా లేని వారు రోడ్లపై చాలామంది ఉన్నారు. అటువంటివారి కోసమే ఈ  ఫీడ్‌ ద నీడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. బర్త్‌ డేలు, ఎదైనా శుభకార్యం జరిగిన సమయంలో ఆహారం మిగిపోవడం సహజం అటువంటి వారు తమకు సమాచారం అందివ్వాలని కమిషనర్‌ కోరారు. హైదరాబాద్‌లో ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఈ ఫీడ్ ద నీట్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.