తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కొణిదెల చిరంజీవి ఫ్యామిలీ. చిరుతో పాటు భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన, కుమార్తెతో కలిసి వచ్చారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన చిరంజీవి.. ప్రతి ఒక్కరూ ఓటు వేయటం బాధ్యతగా తీసుకోవాలన్నారు.
ఓటు వేసినప్పుడే ప్రశ్నించే హక్కు కూడా వస్తుందని.. విలువైన ఓటును ప్రజాస్వమ్య బద్ధంగా నీతిగా ఉపయోగించుకోవాలని సూచించారు చిరంజీవి. ముఖ్యంగా హైదరాబాదీలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉందన్నారు.