హైదరాబాద్ నగరవాసులకు కొత్త సంవత్సరంలో మెట్రోరైల్ మరో కానుక అందించబోతోంది. సంక్రాంతి నాటికి కారిడార్-2 మార్గాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరవాసులకు కొత్త సంవత్సరంలో మెట్రోరైల్ మరో కానుక అందించబోతోంది. సంక్రాంతి నాటికి కారిడార్-2 మార్గాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత నవంబర్లోనే మొదలైన ట్రయల్ రన్స్ ప్రస్తుతం విజయవంతంగా జరుగుతున్నాయి. 11 కిలోమీటర్లు జేబీఎస్ – ఎంజీబీఎస్ మార్గంలో 40 రోజులకు పైగానే మెట్రో ట్రయల్ రన్స్ నిర్వహించారు.
ఈ సమయంలో అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహించి, సాంకేతిక సమాచారాన్ని సంబంధిత సంస్థలకు అందజేశారు. ట్రయల్ రన్స్‌లో భాగంగా 17 రకాల పరీక్షలను చేపట్టారు. ఈ పరీక్షలన్నీ సంతృప్తికరంగా పూర్తయ్యేందుకు నెల నుంచి 45 రోజుల సమయం పడుతుంది.
దీని ప్రకారం జనవరి 15 కల్లా సుమారు 45 రోజుల పాటు ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు. ఆ వెంటనే కారిడార్ -2లో మెట్రోరైలు నడిచే తీరును కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ బృందం రెండు, మూడు రోజుల పాటు పరీక్షించి సర్టిఫికెట్ ఇస్తుంది.