కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే : అసదుద్దీన్ ఒవైసీ 

కశ్మీర్ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Publish Date - January 19, 2019 / 03:50 PM IST

కశ్మీర్ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ : కశ్మీర్ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వ్యవహారంలో పాకిస్థాన్ జోక్యం మానుకోవాలని హితవుపలికారు. కశ్మీర్ ఎప్పుడూ భారత్ లో అంతర్భాగమేనని, అక్కడి ప్రజలు, యువత భారత ప్రజలేనని అన్నారు. 

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో ఒవైసీ పాల్గొన్నారు. తన ప్రసంగాలు విద్వేషపూరితంగా ఉన్నాయంటూ వచ్చే విమర్శలపై ఆయన స్పందించారు. నలుగురినీ ఆలోచింప జేసేందుకే తాను ఆ విధంగా ప్రసంగిస్తానని సమర్ధించుకున్నారు.
 

ట్రెండింగ్ వార్తలు