తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మంత్రి కేటీఆర్

తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నియామకం అయ్యారు. ఈ మేరకు గురువారం (జనవరి 30, 2020) ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

  • Publish Date - January 31, 2020 / 01:01 AM IST

తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నియామకం అయ్యారు. ఈ మేరకు గురువారం (జనవరి 30, 2020) ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నియామకం అయ్యారు. ఈ మేరకు గురువారం (జనవరి 30, 2020) ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కంపెనీస్‌ యాక్ట్‌-2013 ప్రకారం ఏర్పాటైన ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ మొదటి సమావేశం 2017 ఆగస్టు 31న నిర్వహించారు.

2019 అక్టోబర్‌ 29న నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ను చైర్మన్‌గా నియమించాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మంత్రి కేటీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు పంపించింది. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌.. నియామకానికి ఆమోదముద్ర వేశారు.

కార్పొరేషన్‌ చైర్మన్‌గా మంత్రి కేటీఆర్‌, వైస్‌ చైర్మన్‌గా ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌ ఎలక్ట్రానిక్స్‌గా సుజయ్‌ సుభాష్‌ కారంపూరి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను నియమించారు.