సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలి : కేటీఆర్

సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్నికోరారు.

  • Publish Date - November 26, 2019 / 04:12 PM IST

సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్నికోరారు.

సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్నికోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం(నవంబర్ 26, 2019) పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రిసిల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్ వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఉపన్యాసం చేశారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిశారు. 

కేంద్ర జౌళీశాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసిన మంత్రి కేటీఆర్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్ర సహకారం కోరారు. సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి హైదరాబాద్ ఫార్మా రంగం అభివృద్ధికి సహకారించాలన్నారు.