అసెంబ్లీలో కేసీఆర్: ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కేబినెట్‌లో త్వరలో మహిళలకు అవకాశం ఇస్తామని అన్నారు. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని

  • Publish Date - February 23, 2019 / 08:14 AM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కేబినెట్‌లో త్వరలో మహిళలకు అవకాశం ఇస్తామని అన్నారు. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కేబినెట్‌లో త్వరలో మహిళలకు అవకాశం ఇస్తామని చెప్పారు. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చలో మాట్లాడిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు టీఆర్ఎస్ పార్టీని ఆదరించారని చెప్పారు. తమ ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, ఇద్దరు మహిళలకు కచ్చితంగా మంత్రి పదవులు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించామన్నారు.
Read Also: హక్కులను కాలరాస్తున్నారు: కేంద్రంపై కేసీఆర్ గుస్సా

‘మహిళలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఒకరికి కాదు తప్పకుండా ఇద్దరికి ఇస్తాము. మీరేమీ చింత చేయకండి. రాబోయే రోజుల్లో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకుంటాం. అందులో ఇద్దరికి గ్యారంటీగా మంత్రి పదవులు ఇస్తాం. మహిళలను నిర్లక్ష్యం చేయం. మహిళల పట్ల గౌరవం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మహిళలే ఎక్కువ ఓట్లు వేశారు. వారి వల్లే మేము ప్రభుత్వంలోకి వచ్చాము’ అని కేసీఆర్ అన్నారు.
Read Also: ఏపీలో వచ్చేది జగన్ ప్రభుత్వమే : కేటీఆర్ జోస్యం
Read Also: నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారు

ట్రెండింగ్ వార్తలు