హైదరాబాద్: నిత్యం సీరియస్ డిస్కషన్లతో హాట్ హాట్‌గా సాగే అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అసెంబ్లీలో ప్రేమ కథ వినిపించింది. ఓ యంగ్ ఎమ్మెల్యే తన లవ్
హైదరాబాద్: నిత్యం సీరియస్ డిస్కషన్లతో హాట్ హాట్‌గా సాగే అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అసెంబ్లీలో ప్రేమ కథ వినిపించింది. ఓ యంగ్ ఎమ్మెల్యే తన లవ్ స్టోరీని సభలో గుర్తు చేసుకున్నారు. సహచర సభ్యులతో తన ప్రేమ కథను పంచుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ లవ్ స్టోరీ అసెంబ్లీలో హైలైట్‌గా నిలిచింది. డిప్యూటీ స్వీకర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. పద్మారావు గౌడ్‌తో తనకున్న అనుబంధాన్ని బాల్క సుమన్ గుర్తు చేసుకున్నారు. తన ప్రేమ పెళ్లికి పద్మారావు గౌడ్ ఎలా సహకరించారో సభ్యులకు వివరించారు. అన్నా.. మీ వల్లే.. నా ప్రేమ పెళ్లి సక్సెస్ అయ్యిందని డిప్యూటీ స్పీకర్ పద్మారావుకి బాల్క సుమన్ ధన్యవాదాలు తెలిపారు.
తాను విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి పద్మారావు గౌడ్ చాలా సహకరించారని.. వారు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యే అవడం చాలా ఆనందంగా ఉందని సుమన్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బాల్కసుమన్ విషెస్ తెలపడంతో పాటు పద్మారావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన లవ్ స్టోరీని అసెంబ్లీ వేదికగా పంచుకున్నారు. ఈ లవ్‌స్టోరీకి డిప్యూటీ స్పీకర్‌కు లింక్ ఉందని అందుకే చెప్పాల్సి వచ్చిందని సుమన్ తెలిపారు.
టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రేమ వ్యవహారంలో పద్మారావు తనకు చాలా సహకరించారని సుమన్ చెప్పారు. 2012లో ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. ఆ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులతో పద్మారావు మాట్లాడి ఒప్పించారని బాల్క సుమన్ చెప్పారు. సుమన్ ఎమ్మెల్యే అవుతాడు, మంచి పొజిషన్‌లో ఉంటాడు.. కేసీఆర్‌కు దగ్గరవుతాడు.. మంచి పిల్లగాడు అని చెప్పి వాళ్లను ఒప్పించారట. తన లవ్ మ్యారేజీకి అందర్నీ ఒప్పించడంలో పద్మారావు కీలకపాత్ర
పోషించారని సుమన్ అన్నారు. అంతేకాదు దగ్గరుండి పెళ్లి కూడా జరిపించారట. సుమన్ చెప్పిన లవ్ స్టోరీతో సభలో నవ్వులు విరబూసాయి. డిప్యూటీ స్పీకర్ సహా సభ్యులంతా నవ్వుకున్నారు.