పారిపోలేదు : ఇంట్లోనే ఉన్నానని మోహన్ బాబు క్లారిటీ

హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు స్పందించారు. 'కొన్ని టీవీ చానళ్లు నాపై

  • Publish Date - April 2, 2019 / 11:10 AM IST

హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు స్పందించారు. ‘కొన్ని టీవీ చానళ్లు నాపై

హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు స్పందించారు. ‘కొన్ని టీవీ చానళ్లు నాపై చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఇప్పుడే విన్నా. ఇది చాలా బాధాకరం. నేను హైదరాబాద్ లోని నా ఇంట్లోనే ఉన్నా’ అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. చెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు మోహన్ బాబుకి షాక్ ఇచ్చింది. ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి ఈ కేసును వేశారు. మోహన్ బాబుకి జైలు శిక్ష పడిందనే వార్త సంచలనం రేపింది. 2010లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకి ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read Also : బిగ్ బ్రేకింగ్ : మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష

ఓ సినిమా విషయంలో దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి.. మోహన్ బాబు మధ్య విభేదాలు వచ్చాయి. డబ్బు విషయంలో గొడవ తలెత్తింది. 40లక్షల 50వేల రూపాయలకు సంబంధించిన బ్యాంక్ చెక్కులను మోహన్ బాబు ఇచ్చారు. బ్యాంకులో డబ్బు లేకపోవటంతో చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. తొమ్మిదేళ్ల తర్వాత హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు తీర్పు చెప్పింది.

మొత్తం డబ్బును 3 నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. అదనంగా లక్ష 25వేలు జరిమానా విధించింది. 41 లక్షల 75వేల రూపాయలు మోహన్ బాబు చెల్లించాలని ఆదేశిస్తూ గడువు ఇచ్చింది. లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌కు రూ.10వేల జరిమానా విధించింది. డబ్బు సకాలంలో ఇవ్వకుండా మోసం చేసినందుకు ఏడాది జైలు శిక్ష కూడా విధించింది. శిక్ష అమలుకు 30రోజుల గడువు ఉంది. డబ్బు చెల్లిస్తామని మోహన్ బాబు తరఫు న్యాయవాది కోర్టుకి చెప్పడంతో.. కోర్టు మోహన్ బాబుకి బెయిల్ మంజూరు చేసింది.

కోర్టు 3 నెలలు గడువు ఇచ్చిందని.. ఈలోపు డబ్బు కట్టాల్సి ఉంటుందని న్యాయవాది తెలిపారు. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్, ఏ2గా మంచు మోహన్ బాబుగా కోర్టు తేల్చింది. ఏడాది జైలు శిక్ష అని తీర్పు రాగానే మోహన్ బాబు కుటుంబ సభ్యులు, అభిమానులు షాక్ అయ్యారు.
​​​​​​​Read Also : చెక్ బౌన్స్ కేసు : మోహన్ బాబుకి బెయిల్

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై వైవీఎస్ చౌదరవి స‌లీమ్ సినిమా చేశాడు. మంచు విష్ణు హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం డిజాస్ట‌ర్. ఈ చిత్రం విష‌యంలో వైవీఎస్ చౌదరి, మోహన్ బాబు మధ్య విబేధాలు వచ్చాయి. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ సంస్థ‌లో ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాడు మోహ‌న్ బాబు. సినిమా దారుణంగా నిరాశ ప‌రిచింది. న‌ష్టాలు కూడా భారీగా రావ‌డంతో డబ్బు విషయంలో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. దీనికి సంబంధించి రెమ్యునరేషన్‌గా మోహన్‌బాబు.. చౌదరికి ఓ చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో వైవీఎస్ చౌదరి 2010లో మోహన్‌బాబుపై కేసు వేశారు.

Read Also : మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ : బుద్ధా..నోరు ఉంది కదా అని పారేసుకోకండి