హైదరాబాద్ నగరం ఐటీ హబ్ గా మారింది. ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఒక పక్క మెట్రో రైల్ మరోపక్క ఆర్టీ బస్సులు నడుస్తున్నా..సరిపోవటం లేదు. ఐటీ కారిడార్ రూట్ లో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో నే నడుస్తున్నాయి. అయినా ప్రతీ బస్సు రష్ గా ఉంటుంది. దీంతో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ఆర్టీసీ ఐటీ కారిడార్ లో మరిన్ని బస్సులను నడపాలని భావించింది.
ఐటీ కారిడార్ ఏరియా అయిన హైటెక్ సిటీ మరియు వేవ్‌రాక్ మధ్య కొత్తగా ఎనిమిది షటిల్ సర్వీసులకు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU),కుకట్‌పల్లి డిపోలకు చెందిన బస్సులు (195 HW) మైండ్‌స్పేస్, గచిబౌలి మీదుగా ప్రయాణించి వేవ్‌రాక్ సమీపంలోని ఇన్ఫోసిస్ ఆఫీసుల ప్రాంతాల్లో ప్రతి 10 నిమిషాలకు బస్సులు నడిచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
హైటెక్ సిటీ నుంచి వేవ్‌రాక్‌కు వెళ్లేందుకు ఎర్లీ మార్నింగ్ 6 గంటలే ప్రారంభం కాగా..లాస్ట్ బస్ రాత్రి 8.30 వరకూ ఉంటుందన్నారు. ఈ సర్వీసులు మధ్యాహ్నాం లంచ్ టైమ్ 12.20 నుంచి 2 గంటల మధ్య విరామం తీసుకుంటున్నాయన్నారు. వేవ్ రాక్ నుంచి హైటెక్ సిటీకి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బస్ ఉదయం 6:38 గంటలకు ప్రారంభమైతే..లాస్ట్ బస్ రాత్రి 9 గంటలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.