అంబేద్కర్ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి : మందకృష్ణ మాదిగ

అంబేద్కర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించాలని ఎమ్ ఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చమంటూ ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలన్నారు.

  • Publish Date - May 8, 2019 / 11:10 AM IST

అంబేద్కర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించాలని ఎమ్ ఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చమంటూ ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలన్నారు.

అంబేద్కర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించాలని ఎమ్ ఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చమంటూ ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలన్నారు. విగ్రహం కూల్చివేతతో సంబంధం లేని డ్రైవర్లపై చర్యలెందుకని ప్రశ్నించారు. విగ్రహ కూల్చివేతకు ఆదేశాలిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇందిరాపార్క్ దగ్గర మందకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం (మే 8, 2019) మహాగర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరంగా ఉద్యమం చేయాలని తమకు లేదన్నారు. కానీ అంబేద్కర్ జయంతికి ఒక రోజు ముందు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి… చెత్తకుప్పలో పడేస్తే ఊరుకోలేమన్నారు. తాము ఆకాశం నుంచి ఊడిపడే డిమాండ్లు పెట్టడం లేదన్నారు. అంబేద్కర్ ను గౌరవించాలని అంటున్నామని అన్నారు. 

ప్రపంచం మొత్తం అంబేద్కర్ ను గౌరవించుకుంటుంటే అంబేద్కర్ జయంతికి కేసీఆర్ పదే పదే దూరం ఉండటం అగౌరవ పర్చినట్లు కాదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ ను గౌరవించడం నేర్చుకోవాలంటున్నామని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు కూల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని కూల్చడమే తప్పని.. విగ్రహం కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కూల్చిన చోటనే మళ్లీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.  

విగ్రహాన్ని కూల్చివేసి 25 రోజులు గడిచినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు విచారం వ్యక్తం చేయలేదన్నారు. అధికారులపై చర్యలు తీసుకోలేదని, మళ్లీ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టిస్తామని చెప్పలేదన్నారు. అంబేద్కర్ ను గౌరవించే విధంగా కేసీఆర్, ప్రభుత్వ యంత్రాంగం లేదని స్పష్టమవుతుందన్నారు. అంబేద్కర్ వాదులుగా నిరసన, డిమాండ్ చేసే హక్కు తమకు ఉందన్నారు. విగ్రహ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయిలో పని చేసే ఇద్దరు డ్రైవర్లపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇకముందైన అంబేద్కర్ జయంతి వేడుకలకు వస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పాలన్నారు.