నెటిజన్లకు నేరుగా AskKTR పేరుతో రిప్లై ఇస్తున్న కేటీఆర్

ఆస్క కేటీఆర్ పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్లో కేటీఆర్ సమాధానాలిస్తున్నారు. పలు ప్రశ్నలపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ రాజధాని అంశానికి బదులిచ్చారు. ఆరు నెలల పాటు జగన్ చేసిన పరిపాలన బాగుందని అన్నారు. ఇక రాజధాని విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. 

ఇంకో నెటిజన్.. టీఆర్ఎస్ లాంటి పార్టీ ఏపీలోనూ ఉండాలి సర్. అని అడగ్గా.. ‘చాలా థ్యాంక్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు నేను కొన్ని కామెంట్లు విన్నాను. నాయకత్వ లోపంతో తెలంగాణ ఇబ్బంది పడుతుందని హెచ్చరించారంతా. ఇప్పుడు ఇలాంటి కామెంట్లు ఏపీ నుంచి వింటుంటే సంతోషంగా ఉంది. కేసీఆర్ గారి పాలనకు తగ్గ గుర్తింపు దక్కింది’ అని వివరించారు.