హైదరాబాద్ కు టెన్షన్ తప్పింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు కరోనా సోకలేదు. ఇద్దరు అనుమానితులకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి.
హైదరాబాద్ కు టెన్షన్ తప్పింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు కరోనా సోకలేదు. ఇద్దరు అనుమానితులకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. ఐటీ ఉద్యోగికి కరోనా వైరస్ నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒకే ఒక్క కరోనా రోగి ఉన్నాడు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కరోనాపై అతిగా స్పందించదని తెలిపారు. తెలంగాణ గడ్డపై ఒక్కరికి కూడా కరోనా రాలేదన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా సోకిందని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని అన్నారు.
కరోనాపై ఆయన సమీక్షించారు. ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేపట్టాల్సిన వైద్య సదుపాయాలు, వసతుల కల్పనపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరికీ కరోనా రాలేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పారు. నిన్నటి కరోనా అనుమానితుల్లో ఇద్దరికీ నెగెటివ్ వచ్చిందన్నారు.
కరోనా గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాదని స్పష్టం చేశారు. కరోనా పట్ల ప్రజల్లో అపోహలు చెంద వద్దన్నారు. రాష్ట్రంలో ఒక్క మనిషికి కూడా కరోనా వైరస్ రాలేదన్నారు. దుబాయ్ లో ఎఫెక్ట్ అయిన వచ్చి వ్యక్తికి కరోనా వచ్చిందన్నారు. అతనికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. కరోనా అనుమానితుల పట్ల అతిగా స్పందించవద్దన్నారు. కరోనా పట్ల ప్రజల్లో అపోహలు కలిగి ఉండ వద్దన్నారు. కరోనా వ్యాప్తి చెందడంలో వేగంగా ఉన్నా డెత్ రేట్ తక్కువ అన్నారు. ఇతర దేశాల నుంచి వారికే వచ్చిన కరోనా సోకిందని చెప్పారు.
కరోనాపై నెగెటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతోందన్నారు. గాంధీలో ఐసోలేషన్ వార్డులో వసతులు సరిగా లేవని జూడాలు చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారని… అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. సాహసం చేసే అవకాశం అందరికీ దొరకదన్నారు. జిల్లాల నుంచి వచ్చిన స్టాఫ్ కు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. డాక్టర్లే మాస్క్ లతో తిరిగితే ప్రజల్లో భయం పెరుగుతుందన్నారు. పారామెడికల్ స్టాఫ్ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఇప్పటి వరకు 21 మందికి కరోనా అనుమానితులు ఉన్నారని…టెస్టుల్లో ఆ 21 మందికి నెగెటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. తెలంగాణలో ఉన్న ఇన్ ఫ్రాస్ట్రక్చర్ దేశంలో ఎక్కడా లేదన్నారు. గాంధీతోపాటు పెద్ద పెద్ద ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు సరిపోకపోతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో ఐసోలేషన్ వార్డుల్లో ఏర్పాటు చికిత్స అందిస్తామని చెప్పారు. 10 వేల బెడ్లు ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయని..అవి దాటి పోతే కూడా 30 నుంచి 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఉన్నాయని.. అందులో 80 వేల బెడ్ లను ఏర్పాటు చేయవచ్చన్నారు.