రూ.82 లక్షల మెడిసిన్ కి రూ.3.21 కోట్లు డ్రా : ఈఎస్ఐ స్కాంలో కొత్త కోణాలు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి

  • Publish Date - September 29, 2019 / 07:17 AM IST

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి డిస్పెన్సరీ నుంచే పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని అడ్డుపెట్టుకుని ఫార్మాసిస్టులు అందినంత దోచుకున్నారని అధికారులు తెలిపారు. 2015 నుంచి 2019 వరకు పెద్ద మొత్తంలో మందుల కొనుగోళ్లు చేసినట్టు గుర్తించారు. రూ.82లక్షలు విలువ చేసే మందులకు రూ.3.21 కోట్ల సొమ్ము డ్రా చేసినట్టు తేలింది. 

5 కంపెనీల నుంచి మందుల కొనుగోలు చేశారు. 14 మెడిసిన్స్ పై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మందులు సరఫరా చేసిన భాస్కర ఏజెన్సీ, క్రిస్టల్ ఎంటర్ ప్రైజెస్, శ్రీసంతోష్, గరుడ, లక్ష్మీ ఫార్మాలపై ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. వాస్తవానికి 2 రూపాయలు ఖరీదు చేసే మందు బిళ్లలకు రూ.12కి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దేవికారాణి, పద్మ, వసంత అక్రమాలపై ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈఎస్ఐకి చెందిన 12మంది ఫార్మాసిస్ట్ లపైనా విచారన చేస్తున్నారు. 10 ఫార్మా కంపెనీల పాత్రపైనా ఆరా తీస్తున్నారు.

ESI స్కామ్ నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ESI డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురు నిందితులను చంచల్ గూడ జైలుకి తరలించారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి గురువారం(సెప్టెంబర్ 26,2019) దేవికారాణి సహా 23మంది ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 24 గంటలపాటు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. రూ.12కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్టుగా గుర్తించారు.