రూ.వెయ్యి ఫైన్, కేసు నమోదు: హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకొచ్చారు. రాంగ్ రూట్ లో వెళ్లే వారి తాట తీస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారులపై కేసు నమోదు చేయడమే కాదు.. వెయ్యి

  • Publish Date - October 20, 2019 / 07:12 AM IST

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకొచ్చారు. రాంగ్ రూట్ లో వెళ్లే వారి తాట తీస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారులపై కేసు నమోదు చేయడమే కాదు.. వెయ్యి

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకొచ్చారు. రాంగ్ రూట్ లో వెళ్లే వారి తాట తీస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారులపై కేసు నమోదు చేయడమే కాదు.. వెయ్యి రూపాయలు జరిమానా కూడా విధిస్తున్నారు. రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్న వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ డేంజర్ గా మారిందని ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో రాంగ్ రూట్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా కేసులు నమోదు చేసి భారీగా ఫైన్లు వేస్తున్నారు.

అక్టోబర్ 1 నుంచి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాలతో వాహనాలపై నిఘా పెట్టారు. ఈ నిఘాలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. రూల్స్ కి విరుద్ధంగా ప్రతిరోజూ 400మంది రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి.. రాంగ్‌రూట్‌లో ప్రయాణించినందుకు కేసు నమోదు చేసి వెయ్యి రుపాయలను జరిమానా విధిస్తున్నారు.

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రాంగ్ రూట్లు ఉన్న ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. అధికంగా రాంగ్‌రూట్ డ్రైవింగ్ జరుగుతున్న దాదాపు 20 ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణించి ఇతర వాహనదారులను ప్రమాదంలోకి నెడుతున్న వాహనదారులను గుర్తిస్తున్నారు. మాదాపూర్ ఎన్‌ఐఏ బిల్డింగ్, గచ్చిబౌలీ జంక్షన్, మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో 20 రాంగ్‌ రూట్ హాట్‌ స్పాట్లు ఉన్నాయి. తొందరగా వెళ్లాలని, అక్కడ ఉన్న ట్రాఫిక్ పరిస్థితులు, యూటర్న్‌లతో దూరం ప్రయాణించడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాహనదారులు రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

కొత్త రూల్ ని వాహనదారులు స్వాగతిస్తున్నారు. దీని వల్ల మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాంగ్ రూట్ లో ప్రయాణం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ఈ కొత్త రూల్ తో ఇకపై రాంగ్ రూట్ లో వెళ్లే సాహసం చేయరని చెప్పారు.