హైదరాబాద్ : పాతబస్తీలో అమ్మాయిలను నిఖా పేరుతో చేస్తున్న మోసాలు ఎన్నో.. ఎన్నెన్నో. ఈ క్రమంలో పాతబస్తీలోని ఓ ముస్లిం అమ్మాయి వద్ద పెళ్లిపేరుతో లక్షలు దోచేశాడు ఓ నైజీరియన్. ఇస్లాం సంప్రదాయాలు గలిగిన యువతిని పెళ్లి చేసుకోవడం తనకిష్టమని నైజీరియన్..ఇంజినీర్ అస్లాంఖాన్ పేరుతో పాతబస్తీ యువతికి మాయమాటలు చెప్పాడు. పెళ్లి ఖర్చులకు రూ. 75వేల పౌండ్లు పంపుతున్నానంటూ నమ్మించాడు. వాటిని తీసుకునేందుకు కస్టమ్స్ ట్యాక్స్..వంటి ఇతర ట్యాక్స్ ల పేరుతో రూ.16లక్షలు దోచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకొచ్చింది.
Also Read : ముంచేశాడు : మలేషియాలో ఉద్యోగాల పేరుతో మోసం
ఢిల్లీలో నివాసముంటన్న నైజీరియన్ జీవన్ సాథీ డాట్‌కామ్‌లో రెండు నెలల క్రితం బాధితురాలు నమోదు చేసిన వివరాలను సేకరించాడు. దీంతో ఆమెను మోసం చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తన తల్లిదండ్రులు భారతీయులేనని కొన్నేళ్ల క్రితమే లండన్‌లో స్థిరపడ్డారని ఆమెను నమ్మించాడు.ఇంజినీర్‌గా లండన్‌లోనే పని చేస్తున్నానన్నాడు. పెళ్లి చేసుకున్నాక హైదరాబాద్‌లో స్థిరపడదామ’ని..పెళ్లి ఖర్చులకు తొలుత వేల పౌండ్లు పంపుతానని..పెళ్లయ్యాక 2లక్షల పౌండ్లతో ఇల్లు కొందామని ఆమెను మరింత నమ్మించాడు.
ఆ మాటలు నమ్మిన ఆమె అతడితో వాట్సప్ ద్వారా మాట్లాడేది. ఫిబ్రవరి 12 నైజీరియన్ ఫోన్ చేసి పెళ్లి ఖర్చులకు 75వేల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.54లక్షలు) పంపుతున్నానని..దానికి సంబంధించిన బాక్స్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రాగానే అధికారులు ఫోన్ చేస్తారని చెప్పాడు. మూడు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసిన నైజీరియన్ ఆ బాక్స్ నీకు చేరాలంటే..రూ.1.5లక్షలు ఇవ్వాలని.. చెప్పి ఇలా ఒక వారం రోజుల్లో రూ.16 లక్షలు తన ఎకౌంట్ లో వేయించుకున్నాడు.
Also Read : నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్
మరోసారి ఫోన్ చేసి..తమ నిబంధనల ప్రకారం 10వేల పౌండ్లు మాత్రమే ఉచితంగా ఇస్తామనీ..మిగిలిన 65వేల పౌండ్లకు రూ.1.5లక్షలు చెల్లించాలని చెప్పగా బాధితురాలు 1.5 లక్షలు అతడు చెప్పిన ఖాతాలో వేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ రూ.1.70లక్షలు కట్టాలని చెప్పగా ఆమె ఆ మొత్తాన్ని కూడా పంపించింది. గిఫ్ట్ ట్యాక్స్ కింద రూ.8.30లక్షలు పంపించాలని కోరగా..తన వద్ద డబ్బు లేకపోవడంతో తండ్రికి విషయం చెప్పింది.
ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఆమె తండ్రి ఉన్న ఇల్లు అమ్మి రూ.70లక్షలను బ్యాంకులో వేశాడు. కుమార్తె కోసం అందులోంచి రూ.10లక్షలను ఇచ్చాడు. ఇక నైజీరియన్ ఫోన్ చేసి.. చివరగా రూ.4.5లక్షలు ఇస్తేనే గిఫ్ట్ బాక్స్ పంపిస్తామంటూ చెప్పాడు. దీంతో ఆమె రూ.4.5లక్షలు అతడు చెప్పిన ఎకౌంట్ లో వేసింది. తరువాత అతనికి ఫోన్ చేయగా..నైజీరియన్ ఫోన్స్ స్విచ్ఛాఫ్ చేశాడు. మోసం జరిగిందని గ్రహించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది సదరు బాధితురాలు.
Also Read : చంద్రుడు వద్దా : చైనా కృత్రిమ సూర్యుడు