అలర్ట్ అలర్ట్ : 24న హైదరాబాద్‌లో నీటి సరఫరా బంద్
- veegam team
- Published On : January 23, 2019 / 07:32 AM IST
హైదరాబాద్ : నగర వాసులకు ముఖ్య గమనిక. ముందే జాగ్రతపడాల్సిన విషయం ఇది. 2019, జనవరి 24వ తేదీ గురువారం నగరంలోని చాలా ప్రాంతాలకు నీటి సరఫరా బంద్ కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు. మంజీరా నీటిని సరఫరా చేస్తున్న పంపింగ్ స్టేషన్ పరిధిలోని సబ్‌స్టేషన్లలో మరమ్మతులు చేస్తున్నారు. రొటీన్ పవర్ షట్ డౌన్‌లో భాగంగా నీటి సరఫరా ఆగిపోనుంది. అత్యవసర పరిస్థితుల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు:
బీహెచ్‌ఈఎల్
అశోక్నగర్ హెచ్ఐజీ
హెచ్‌సీయూ
ఎస్‌బీఐటీ
మదీనాగూడ
హెచ్ఐజీ, పి.సత్యనారాయణ ఎన్‌క్లేవ్
మియాపూర్
ఆర్సీ పురం
అశోక్ నగర్
చందానగర్
అమీన్ పూర్
హుడా కాలనీ
పీజేఆర్ కాలనీ
దీప్తీ శ్రీనగర్
శేరిలింగంపల్లి
