వారంలో రెండు రోజులు గ్రామాలకు వెళ్లండి : తలసాని

  • Publish Date - November 23, 2019 / 10:03 AM IST

తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం.. వేగంగా అభివృద్ధి చెందేందుకు జిల్లాల సంఖ్య పెంచిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల పరిధి కూడా తగ్గింది. ఈ క్రమంలో జిల్లాల పరిధి చిన్నగా ఉంది కాబట్టి అభివృద్ధి చేసేందుకు అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వారంలో రెండు రోజుల పాటు అధికారులు గ్రామాల్లో పర్యటించాలనీ సూచించారు. 

రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాల్లో పర్యటించాలనీ..జిల్లా స్థాయి అధికారులు గ్రామాల్లోను పర్యటించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు వినియోగించుకుంటున్నారా? అనే విషయాలను  తెలుసుకోవాలన్నారు.  అంబులెన్స్ వాహనాల పని తీరు  ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకోవాలని లేకుండా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే గోపాల మిత్ర సేవల్ని వినియోగించుకుని..గొర్రెల కాపరులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాల పరిధి చాలా చిన్నవనీ..అద్భుతమైన ఫలితాలు వచ్చేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం ఎన్నో సహకారాలను అందిస్తోంది..అయినా పాల ఉత్పత్తులు ఏమాత్రం పెరగటంలేదని పాల ఉత్పత్తులు పెంచటానికి అసవరమైన విషయాలపై అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి తలసాని అధికారులకు సూచించారు.