హైదరాబాద్ శివారు అల్వాల్‌లో విషాదం నెలకొంది. చేతులు కడుక్కునేందుకు నల్లా దగ్గరికి వెళ్లిన వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు.
హైదరాబాద్ శివారు అల్వాల్‌లో విషాదం నెలకొంది. చేతులు కడుక్కునేందుకు నల్లా దగ్గరికి వెళ్లిన వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అనే గోపాల్ వ్యక్తి హైదరాబాద్ శివారు అల్వాల్‌లో కాణాజిగూడ దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు.
అయితే గోపాల్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో… పెట్రోల్ బంక్‌లోని నల్ల దగ్గర చేతులు కడుక్కోవడానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన గోపాల్ కు పక్కనే ఉన్న ఐరన్‌రాడి తగిలింది. దానికి విద్యుత్ కనెక్ట్ అయ్యి ఉండడంతో షాక్ కొట్టి చనిపోయాడు. పోలీసులు గోపాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పెట్రోల్ బంక్ యాజమాన్యం నిర్లక్ష్యంగానే గోపాల్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గోపాల్ మృతితో కుటుంబీకులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. అతని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.