హైదరాబాద్ నగరంలోని పార్కుల్లో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకానున్నాయి. జిమ్ లకు వెళ్లి వేలకు వేలు ఇకపై ఖర్చు చేయకుండా జీహెచ్‌ఎంసీ పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నగరంలోని ఆరు ప్రాంతాల్లోని పార్కుల్లో ఓపెన్ జిమ్ లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా మరో 68 పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయనున్నారు.
2020 జనవరికల్లా ఇవి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్కుల్లో వాకింగ్ కోసం వచ్చేవారికి ఇవి ఎంతో ఉపయోగంగా ఉండేలా పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసింది జీహెచ్ ఎంసీ.
కాగా..ఢిల్లీ, పుణె, నాగపూర్ వంటి పలు నగరాల్లో ఈ ఓపెన్ జిమ్ లు అందుబాటులోకొచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు కూడా ఈ సౌకర్యాన్ని అందించాలని జీహెచ్ ఎంసీ భావించటంతో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటుచేసినా..జిమ్ పరికరాలను సరిగా మెయిన్ టెన్ చేయకపోవటం పనికిరాకుండా పోయాయి.
ప్రస్తుతం ఇందిరాపార్కు, వెస్ట్‌మారేడ్‌పల్లి జవహర్‌నగర్ పార్కు, కృష్ణకాంత్ పార్కు, ఇమ్లీబన్ పార్కు, శేరిలింగంపల్లిలోని గుల్‌మొహర్ పార్కు, ఏఎస్‌రావునగర్ పార్కులతో పాటు మరికొన్ని పార్కుల్లో మాత్రమే ఈ ఓపెన్ జిమ్ లు కొనసాగుతున్నాయి.