సానుభూతితో విధుల్లోకి తీసుకోండి : సీఎం కేసీఆర్ కు పవన్ విజ్ఞప్తి

ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు జనసేనాని పవన్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి

  • Publish Date - November 20, 2019 / 03:12 PM IST

ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు జనసేనాని పవన్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి

ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు జనసేనాని పవన్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై జనసేనాని ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆర్టీసీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా జనసేన ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులు తనను కోరారని పవన్ తెలిపారు. 

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని సీఎం కేసీఆర్‌ను పవన్ కోరారు. 40 రోజులకు పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. తద్వారా ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. కార్మికులందరూ విధుల్లో చేరాక సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాలని కేసీఆర్‌కు పవన్ విజ్ఞప్తి చేశారు.