దయచేసి ఇలా చేయొద్దు : బైక్ పై వెళ్లే వారికి పోలీస్ కమిషనర్ రిక్వెస్ట్

  • Publish Date - December 21, 2019 / 01:09 PM IST

బైక్ పై వెళ్లేటప్పుడు.. ఎండ లేదా వాన నుంచి రక్షణ కోసం చాలామంది గొడుగులు వాడతారు. ఇది కామన్. అయితే.. బైక్ పై వేగంగా వెళ్తూ గొడుగు తెరిస్తే చాలా ప్రమాదకరం అని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు ప్రమాదమో వివరిస్తూ ఓ వీడియోను సైతం షేర్ చేశారు. ఇందులో.. బైక్ పై వెళ్తుండగా.. వెనుక కూర్చున్న ఓ యువతి సడెన్ గా గొడుగు తెరిచింది. గాలి వేగంగా రావడంతో గొడుకు ఆమెని వెనక్కి లాగేసింది. దీంతో యువతి బైక్ నుంచి కిందపడిపోయింది.

అమాంతం కిందపడటంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెకి ప్రథమ చికిత్స అందించి కాపాడారు. ఈ వీడియోను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. డ్రైవింగ్ చేస్తుండగా.. గొడుగులు వాడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.