తప్పించుకుని తిరుగుతున్న మాజీమంత్రి అఖిలప్రియ భర్తపై గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. విధులకు

  • Publish Date - October 8, 2019 / 03:10 PM IST

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. విధులకు

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో తెలిపారు. ఎస్ఐ ఫిర్యాదుతో భార్గవ్ రామ్ పై 353, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే భార్గవ్ పై రెండు కేసులు ఉన్నాయి. భార్గవ్ రామ్ తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. 

తప్పించుకుని తిరుగుతున్న భార్గవ రామ్ ను పట్టుకునేందుకు ఆళ్లగడ్డ ఎస్ఐ రమేశ్ హైదరాబాద్ వచ్చారు. నిన్న కారు డ్రైవ్ చేస్తూ ఎస్ఐ రమేశ్ కు భార్గవ్ కనిపించారు. భార్గవ్ రామ్ కారును ఆపేందుకు ఎస్ఐ రమేశ్ యత్నించారు. కారు ఆపినట్లే ఆపిన భార్గవ్.. తమపైకి పోనిచ్చాడని ఎస్ఐ రమేశ్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుతో గుద్దే ప్రయత్నం చేశాడని ఫిర్యాదులో తెలిపారు.