అంబులెన్స్ ప్లాన్ : కొండా విశ్వేశ్వరరెడ్డి డబ్బు పట్టివేత

ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు.. ఇంకా ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంది అనేది కూడా కోడ్ భాషలో రాసి ఉంది. ఈ పత్రాల్లోని లెక్కలు,

  • Publish Date - April 10, 2019 / 06:12 AM IST

ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు.. ఇంకా ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంది అనేది కూడా కోడ్ భాషలో రాసి ఉంది. ఈ పత్రాల్లోని లెక్కలు,

తెలంగాణ రాష్ట్రం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి చెందిన రూ.10 లక్షలు పట్టుకున్నారు పోలీసులు. గచ్చిబౌలిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బయటపడింది. ఏప్రిల్ 10వ తేదీ ఉదయం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు దగ్గర కొండా సోదరుడు సందీప్ రెడ్డి కారును తనిఖీ చేశారు. అందులో 10 లక్షల క్యాష్ పట్టుబడింది. అదే కారులో ఎంపీ విజిటింగ్ కార్డులు, డబ్బు లెక్కలకు సంబంధించిన కాగితాలు ఉన్నాయి. ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు.. ఇంకా ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంది అనేది కూడా కోడ్ భాషలో రాసి ఉంది. ఈ పత్రాల్లోని లెక్కలు, కోడ్ భాషపై విచారణ చేస్తున్నారు. సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Read Also : ఎన్నికల్లో.. మద్యం,మనీల వరద: రూ.528.98 కోట్లు సీజ్

కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన ఓ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ ద్వారా డబ్బు తరలింపు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హవాలా రూపంలో ఈ డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ లావాదేవీలపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు రంగంలోకి దిగారు. పోలింగ్ ముందు రోజు కొండా విశ్వేశ్వరరెడ్డికి డబ్బు కోట్ల రూపాయల్లో బయటపడటం సంచలనంగా మారింది. గ్రామాల్లోని చాలా మంది నేతలకు అంబులెన్స్ ద్వారా తరలించినట్లు అనుమానిస్తున్నారు. సందీప్ రెడ్డి.. కొండా విశ్వేశ్వరరెడ్డి అడ్వకేట్ గా ఉన్నారు. కోడ్ భాషలో రాసిన లెక్కలపై అడ్వకేట్ ను ప్రశ్నిస్తున్నారు. 

చేవెళ్లు, పరిగి, వికారాబాద్, మహేశ్వరం నియోజకవర్గాల్లో మద్యం పంపిణీ లెక్కలు కూడా ఈ కాగితాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి అనుచరులు డబ్బులు, మద్యం సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు ఈ పత్రాల్లో బయటపడింది.
Read Also : లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు