హైదరాబాద్ : భావి భారత పౌరులు బ్రతుకులు అడుగడుగునా ప్రమాదాల నీడలో క్షణ క్షణం భయం భయంగా సాగుతోంది. చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు.. అఘాయిత్యాలు…ఘోరాలు నమోదువుతున్న క్రమంలో చిన్నారుల జీవనం ప్రమాద భరితంగా తయారయ్యింది. కౌమారదశలో ఉన్న బాలికలు తప్పిపోయారని ఫిర్యాదు చేసేందుకు వెళితే.. కొందరు పోలీసులు వెకిలిగా ప్రశ్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్యాప్తులో జాప్యం..నిర్లక్ష్యం వెరసి తప్పిపోయిన చిన్నారులు (బాలురు.. బాలికలు) నేరగాళ్ల చేతుల్లో బలైపోతున్నారు. నగరంలోని రెయిన్‌బజార్ భవానినగర్ పీఎస్ పరిధిలో పదేళ్ల బాలుడు, బాలిక చనిపోయిన ఘటన తెలిసిందే. పాతబస్తీలోని మిస్సింగ్ కేసులు అధిక సంఖ్యలోనే నమోదవుతున్నాయి.
2 సంవత్సరాలలో చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
కేవలం రెండే రెండు సంవత్సరాల్లో చిన్నారులపై లైంగికదాడులు, అత్యాచార ఘటనలు 99 వరకు జరిగినట్లుగా తెలుస్తోంది. వీటి సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి పోలీసుల నిర్లక్ష్యం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వారు సకాలంలో దర్యాప్తు చేపట్టినట్లయితే తమ చిన్నారులు రక్షించే వారని బాధితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరికి 70 శాతంమంది చిన్నారులు అన్యాయాలకు బలైపోయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. తమ బిడ్డలు మిస్సింగ్ అనీ..కిడ్నాప్ అయ్యారని రక్షించమంటూ వేడుకుంటున్నా.. కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల పేరుతో..విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారనీ..కొన్ని సందర్భాలలో అయితే అసలు కేసులే నమోదు చేసుకోవటంలేదనే విమర్శలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి.
కిడ్నాప్ చేసిన బాలికలపై అత్యాచారారలకు పాల్పడే అవకాశముందనీ..ఒకో సందర్భంలో నేరగాళ్లు మన నేరం బైటపడుతుందని హత్యకు కూడా చేస్తారని తెలిసినా పోలీసులు స్పందించడంలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి రెయిన్‌బజార్ పరిధిలోని బాలుడి హత్య ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ బాలుడిని ఇంట్లో ఉండే మామే కిడ్నాప్ చేశాడు. పోలీసులు ఆధారాలు సేకరించేలోపే అతడిని చంపేశాడు. బాలుడి మిస్సింగ్ తరువాత కేసు పెట్టిన పోలీసుల నుండి ఎటువంటి స్పందనా రాకపోవటంతోనే తమ బిడ్డ హత్యకు గురయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే స్టేషన్ పరిధిలో జుబేర్ సిద్దిఖీ(21) బాలికను కిడ్నాప్‌చేసి బండ్లగూడ వద్ద ఓ స్నేహితుడి సహాయంతో ఇంటిలో ఉంచి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
సౌత్ జోన్ పరిధిలో మిస్సింగ్ కేసులు 2015 నుంచి 2018
కేసులు-దిొరికినవి
2015 | 2016 | 2017 | 2018 | |
కేసులు – దిొరికినవి | కేసులు – దిొరికినవి | కేసులు – దిొరికినవి | కేసులు – దిొరికినవి | |
గర్ల్స్ | 73 63 | 95 93 | 77 68 | 86 76 |
బోయ్స్ | 67 58 | 67 66 | 49 48 | 56 55 |