మందుబాబులకు న్యూఇయర్ షాక్ : దొరికితే రూ.10వేలు ఫైన్.. వాహనం సీజ్

మరికొన్ని గంటల్లో నూత‌న సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఏడాదికి

  • Publish Date - December 23, 2019 / 03:37 AM IST

మరికొన్ని గంటల్లో నూత‌న సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఏడాదికి

మరికొన్ని గంటల్లో నూత‌న సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఏడాదికి స్వాగతం చెబుతూ ఉత్సాహంగా గడుపుతారు. పార్టీలు చేసుకుంటారు. అర్థరాత్రి కేక్‌ కట్ చేసి విషెస్ జరుపుకుంటారు. ఇక యువత గురించి చెప్పక్కర్లేదు. వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. బైక్ లు, కార్ల మీద తిరుగుతూ న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెబుతారు. కేరింతల్లో మునిగితేలుతారు. 

న్యూఇయర్ సెలబ్రేషన్స్ రోజున రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఏటా వీటిని తగ్గించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈసారి కూడా అందుకోసం రూల్స్ తీసుకొచ్చారు. 2020 వేడుకల్లో… రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు, అపశ్రుతులకు ఆస్కారం లేకుండా.. ప్రశాంతంగా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. పోలీసులు జారీ చేసిన నిబంధనలను ఈవెంట్స్‌ నిర్వాహకులు, హోటల్స్‌, పబ్‌ యాజమాన్యాలు, ఇతరులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. మహిళలకు పటిష్ట భద్రత, రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా.. రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు విజన్‌ 2020 లక్ష్యాలను వివరించారు.

న్యూ ఇయ‌ర్ సమయంలో హ్యాపీగా వేడుకలు జరుపుకుంటే పర్లేదు. కానీ వేడుకల పేరుతో రచ్చ చేయడం, గొడవలకు దిగడం, అమ్మాయిలను ఏడిపించడం వంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం తాట తీస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ అతిక్రమిస్తే… జైల్లో పెడతామన్నారు. ఈసారి బాణసంచా కాల్చినా, బార్లు పబ్బుల్లో అశ్లీల వేషాలు వేసినా చర్యలు తప్పవు. ఇక మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. డిసెంబర్ 31 రాత్రి.. తాగి వాహనాలు నడుపుతూ దొరికితే రూ.10వేలు ఫైన్ వేస్తామన్నారు. అంతేకాదు వాహనాన్ని సీజ్ చేస్తారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి దుర్ఘటనలు జరక్కుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాదరహితంగా వేడుకలు జరుపుకునేందుకు జంట నగరాల కమీషనర్లు ఈ నిబంధనలను రూపొందించారు.

డిసెంబర్ 31 రాత్రి.. న్యూ ఇయర్ వేడుకల పేరుతో భారీగా మద్యం తాగుతారు. అలా తాగి సైలెంట్ గా ఉంటే ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. కానీ బైక్ లు, కార్లు వేసుకుని రోడ్డెక్కుతామంటే మాత్రం ఊరుకునేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి మందుబాబుల తాట తీసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. తాగి వాహనాలు నడిపే వారికి చుక్కలు చూపిస్తారు. డిసెంబర్ 31న రాత్రి స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ లు నిర్వహించనున్నారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడితే రూ.10 వేల భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేయనున్నారు.

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తాగుబోతుల కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. దీంతో ఈ ఏడాది ఆలా జరగకూడdనే ఉద్దేశ్యంతో వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు జరక్కుండా నగర పోలీసులు పలు నిబంధలు విధించారు. ఇందులో భాగమే రూ.10వేలు ఫైన్, వాహనం సీజ్. ఇవండి.. పోలీసులు విధించిన కొత్త రూల్స్. సో.. బీ కేర్ ఫుల్. ఎక్కడా హద్దులు దాటకుండా న్యూఇయర్ వేడుకులను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి.

Also Read : అడిగి మరీ తీసుకోండి.. లేదంటే రూ.500 ఫైన్