పాకిస్తాన్‌లో అరెస్టైన్ ప్రశాంత్‌పై మీడియాలో అసత్య ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.
పాకిస్తాన్‌లో అరెస్ట్ అయిన ప్రశాంత్‌పై మీడియాలో అసత్య ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. ప్రశాంత్ రా ఏజెంట్ కాదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. దుష్ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత్ విషయంలో తొలి నుంచి వాస్తవాలనే ప్రసారం చేస్తోంది 10టీవీ. ప్రశాంత్ అరెస్ట్ వ్యవహారాన్ని 10టీవీనే వెలుగులోకి తెచ్చింది. ప్రియురాలి కోసమే ప్రశాంత్ సరిహద్దులు దాటాడని కథనాలు ప్రసారం చేసింది 10టీవీ.
త్వరలోనే ప్రశాంత్.. భారత్‌కు తిరిగివచ్చే అవకాశం ఉందన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. దౌత్యపరంగానే ప్రశాంత్ విడుదల సాధ్యమవుతుందన్న ఆయన.. ప్రశాంత్ మిస్సింగ్‌పై ఫిర్యాదు అందిన వెంటనే తాము చాలా గాలించామన్నారు. లుకౌట్ నోటీసులు ఇచ్చినా అతడి ఆధారాలు దొరకలేదన్నారు.
భారతీయులెవరైనా పాకిస్తాన్‌లో పట్టుబడితే ఆ దేశం అనుమానించడం సహజమేనన్నారు సీపీ సజ్జనార్. అయితే.. ప్రశాంత్ అమాయకుడన్న విషయం పాకిస్తాన్ ఇప్పటికే గుర్తించిందన్న సీపీ.. అసలు ప్రశాంత్ అక్కడికి ఎందుకు వెళ్లాడన్న దానిపై తాము దర్యాప్తు చేస్తామన్నారు.