మందుబాబుల మనోవేదన : హైదరాబాద్ లో ప్రీమియర్ లిక్కర్ కొరత

హైదరాబాద్ లో ప్రీమియం లిక్కర్ కొరత ఏర్పడింది. ప్రీమియం లిక్కర్ కోసం మందు బాబులు అవస్థలు పడుతున్నారు. తమకిష్టమైన బ్రాండ్లు లభించక నిద్రలేని రాత్రులు

  • Publish Date - September 24, 2019 / 09:56 AM IST

హైదరాబాద్ లో ప్రీమియం లిక్కర్ కొరత ఏర్పడింది. ప్రీమియం లిక్కర్ కోసం మందు బాబులు అవస్థలు పడుతున్నారు. తమకిష్టమైన బ్రాండ్లు లభించక నిద్రలేని రాత్రులు

హైదరాబాద్ లో ప్రీమియం లిక్కర్ కొరత ఏర్పడింది. ప్రీమియం లిక్కర్ కోసం మందు బాబులు అవస్థలు పడుతున్నారు. తమకిష్టమైన బ్రాండ్లు లభించక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎంత డబ్బు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నా.. స్టాక్ లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు జానీ వాకర్, బ్లాక్ డాగ్ విస్కీలు మద్యం షాపుల్లో కనిపించడం లేదు. నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. హైదరాబాద్ నగరం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. దీంతో ప్రీమియం బ్రాండ్ లిక్కర్ ప్రియులు పరేషాన్ అవుతున్నారు. ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల కొరతకు కారణం ప్రభుత్వమే అని మద్యం షాపుల యజమానులు అంటున్నారు.

మ్యాటర్ ఏంటంటే.. సెప్టెంబర్ 30వ తేదీతో మద్యం పాలసీ ముగుస్తుంది. త్వరలోనే ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రకటించనుంది. సెప్టెంబర్ 30తో మద్యం షాపుల నిర్వహణ లైసెన్స్ గడువు ముగుస్తుంది. మద్యం షాపులు నిర్వహణకు ప్రభుత్వం లైసెన్స్ పొడిగిస్తుందో లేదో తెలియదు. తమకు లైసెన్సులు లభిస్తాయో లేదో అని వైన్ షాప్ ఓనర్లు కంగారు పడుతున్నారు. దీనిపై క్లారిటీ లేదు. కొత్త మద్యం పాలసీ ప్రకారం.. లైసెన్స్ తమకే ఇస్తారో లేదో తెలియదు. గందరగోళ పరిస్థితులు ఉండటంతో మద్యం షాపుల యజమానులు ప్రీమియం లిక్కర్లు కొనడం మానేశారు. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెట్ నుంచి కొనుగోళ్లు ఆపేశారు. స్టాక్స్ తెప్పించడం స్టాప్ చేశారు. ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు జానీ వాకర్ బ్లాక్ లేబుల్ విస్కీ, బ్లాక్ డాగ్ స్కాచ్ విస్కీ, రమ్ తెప్పించడం లేదు. దీంతో నగరవ్యాప్తంగా వీటి కొరత తీవ్రంగా ఉంది. సికింద్రాబాద్, గచ్చిబౌలి ప్రాంతాల్లో మద్యం షాపుల ఓనర్లు ఏకంగా నో స్టాక్ బోర్డులే పెట్టేశారు. 

”ప్రస్తుతం డైలీ సేల్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాము. ఎక్కువ స్టాక్ లు పెట్టి రిస్క్ తీసుకోలేము. లైసెన్స్ గురించి స్పష్టత లేదు. రెండు రోజుల్లో లైసెన్స్ గురించి క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నాము. ఒక వేళ భారీగా స్టాక్ తెప్పించాక లైసెన్స్ రాకపోతే.. సరుకుని తాము ఏం చేసుకోవాలి” అని ఓ మద్యం ఓనర్ చెప్పాడు. గతంలో బెవరేజస్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున స్టాక్ తెప్పించేవారు. అయితే ప్రస్తుతం లైసెన్స్ గురించి అస్పష్టత ఉంది. దీంతో స్టాక్ తెప్పించే సాహసం చెయ్యడం లేదని వైన్ షాప్ నిర్వాహాకులు వివరించారు. 2017 అక్టోబర్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వం మద్యం షాపుల నిర్వహణకు లైసెన్స్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 216 లిక్కర్ షాపులు ఉన్నాయి.