హై సెక్యూరిటీ బ్లాక్ లో ప్రియాంక హత్య కేసు నిందితులు

ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను చర్లపల్లి జైలులో హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచారు. నిందితులు నలుగురికి మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించడంతో... జైలుకు తరలించి వారికి ఖైదీ నెంబర్లు కేటాయించారు.

  • Publish Date - December 1, 2019 / 03:13 AM IST

ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను చర్లపల్లి జైలులో హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచారు. నిందితులు నలుగురికి మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించడంతో… జైలుకు తరలించి వారికి ఖైదీ నెంబర్లు కేటాయించారు.

ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను చర్లపల్లి జైలులో హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచారు. నిందితులు నలుగురికి మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించడంతో… జైలుకు తరలించి వారికి ఖైదీ నెంబర్లు కేటాయించారు. ఏ1 మహ్మద్‌ ఆరిఫ్‌కు 1979, ఏ2 శివ-1980, ఏ3 చెన్నకేశవులు-1981, ఏ4 నవీన్‌-1982 నెంబర్లను కేటాయించారు. మరోవైపు.. వీరి తరపున ఎవరూ వాదించకూడదని.. బాధితురాలి కుటుంబసభ్యులకు న్యాయ సహాయం చేయాలని తెలంగాణ బార్ అసోసియేషన్ నిర్ణయించింది.

డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. మహబూబ్ నగర్ జైలుకు తరలించాలని అనుకున్నా ప్రజాగ్రహంతో పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. భారీ భద్రత మధ్య చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిని తరలిస్తున్న పోలీసు బస్సుపైకి ప్రజలు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. వారిని చెదరగొట్టారు. పోలీసులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ ప్రియాంక అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వేలాదిగా వచ్చిన జనాలతో షాద్ నగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

2019, నవంబర్ 30వ తేదీ శనివారం షాద్ నగర్ పీఎస్ దగ్గరకు నిందితులను తీసుకొచ్చారు. అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వేలాది మంది ప్రజలు పోలీసు స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. తమకు నిందితులను అప్పగించాలని డిమాండ్ చేశారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించాయి. కానీ ప్రజాగ్రహం మరింత ఎక్కువైంది. భారీ భద్రత నడుమ నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.