ప్రియాంకారెడ్డి హత్య తీవ్రంగా కలచివేసింది : రాహుల్ గాంధీ

ప్రియాంకారెడ్డి హత్య ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

  • Publish Date - November 29, 2019 / 02:38 PM IST

ప్రియాంకారెడ్డి హత్య ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియాంక హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ప్రియాంకారెడ్డి హత్య తనను తీవ్రంగా కలచివేసిందని రాహుల్‌ అన్నారు. ఓ మనిషి సాటి మనిషిపై ఇంత క్రూరంగా ఎలా దాడికి పాల్పడతాడనేది ఊహించుకోవడానికే భయంకరంగా ఉందన్నారు. ఈ కష్టకాలంలో బాధితురాలి కుటుంబానికి ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 

మరోవైపు ప్రియాంకా రెడ్డి దారుణ హత్యపై పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియాలో సంతాపం తెలిపారు. ప్రియాంకా మృతి తమను కలచివేసిందన్నారు. ఇలాంటి పరిస్థితి మరో ఆడపిల్లకు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.