సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ 

  • Publish Date - November 14, 2019 / 02:50 AM IST

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి(07429/07430) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ రైలు (నవంబర్ 15, 2019) సాయంత్రం 7.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.25 కు తిరుపతి చేరుకుంటుంది.
 
తిరుగు ప్రయాణంలో (నవంబర్ 17, 2019) సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుటుంది. మార్గంమధ్యలో ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ప్రత్యేక రైలులో అన్ని స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.