ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆవర్తనం ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణలో రెండు రోజులు(సెప్టెంబర్ 29,30)
ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆవర్తనం ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణలో రెండు రోజులు(సెప్టెంబర్ 29,30) వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరుగా, కొన్ని చోట్ల భారీగా వానలు పడే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.
దేశంలో ఈ ఏడాది ఇప్పటికే సాధారణం కన్నా ఏడు శాతం ఎక్కువగా వర్షం కురిసింది. సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు కొనసాగే ఉన్నందున సాధారణం కన్నా అధిక వర్షపాతం రికార్డు కావచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు, నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వరద ఉధృతికి మరోసారి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేశారు. మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ఇవాళ(సెప్టెంబర్ 29,2019) కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.