జోరుమీదున్న ‘రియల్‌’ : ఎన్నికలొచ్చినా..తగ్గలేదు

  • Publish Date - March 22, 2019 / 05:38 AM IST

హైదరాబాద్‌: కొన్ని కాలంగా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. కొనేవారు కొంటున్నారు..అమ్మేవారు అమ్ముతున్నారు. దీంతో సర్కార్ ఖజానాకు కాసులు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో స్థిరాస్తి విక్రయాలు 2019 మార్చి నెలలో మరింతగా పెరిగాయి.  సాధారణంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే..విక్రయాలు కాస్త నెమ్మదిస్తాయి. కానీ తెలంగాణాలో  లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నా..ఆ ప్రభావం రియల్ రంగంపై ఏమాత్రం పడలేదు. 
Read Also : చావుతో ఆటలు : PubG ఆడుతూ నరాలు పట్టేసి.. చనిపోయాడు

ఈ క్రమంలో ఒక్క మార్చి నెలలోనే 98,388 రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్ల ఆదాయం వచ్చింది.  ఆర్థిక సంవత్సరం చివరి నెల అయినందున పన్ను మినహాయింపులు పొందడానికి కొందరు స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఫిబ్రవరి నెలలో 1,52,986 దస్త్రాలు రిజిస్టర్‌ అయితే మార్చిలో ఇప్పటికే అవి  లక్షకు చేరాయి. ఆదాయ పరంగా చూస్తే ఫిబ్రవరిలో రూ.532 కోట్లు వస్తే, ఇప్పటికే రూ.400 కోట్లు దాటింది. 2018లో 11,50,524 దస్త్రాలు (ఫైల్స్) రిజిస్టర్‌ అవ్వగా..ఈ ఏడాది ఇప్పటికే 14,05,904 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలాఖరుకు రూ.5,900 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి నెలఖరుకు రూ.6,500 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.