రిపబ్లిక్ డే : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు 

  • Publish Date - January 25, 2019 / 05:36 AM IST

హైదరాబాద్:  సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జనవరి 25 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ క్రమలో ట్రాఫిక్ పరిమితులను ప్రజలు పాటించాల్సివుంది. 

  • పరేడ్ గ్రౌండ్ వద్ద శనివారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. 
  • SBH క్రాస్ రోజు నుండి బేగం పేట వైపు వెహికల్స్ కు పర్మిషన్ లేదు..అలా ప్యాట్నీ సెంటర్..RP ROA..ప్యారడైజ్..SD ROAD..స్వీకార్ ఉపకార్, టివలోలి, బాలంరాయి వైపు ట్రాఫిక్ ను మళ్లించనున్నారు
  • CTO X ROAD  నుండి పరేడ్ గ్రౌండ్ వైపు వెహికల్స్ కు నో ఎంట్రీ ఉంటుంది. దీంతో ఆయా వెహికల్స్ కు బాలంరాయి- తాడ్ బండ్- మస్తాన్ కేఫ్..బ్రూక్ బాండ్, టివోలి, స్వీకార్ ఉపకార్-SBH వైపు లేదా ప్యారడైజ్..SD ROAD..ప్యాటీసెంటర్, క్లాక్ టవర్, సంగీత్ వైపు వెళ్లాలి.
  • టివోలీ క్రాస్ రోడ్స్ నుండి ప్లాజా వైపు వెహికల్స్ బాలంరాయి,..సీటీఓ..ఉపకార్..వైఎంసీఏ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • ప్యారడౌజ్ క్రాస్ రోడ్స్ నుండి ప్లాజా వైపు వెళ్లే వెహికల్స్ ప్యారడైజ్..ప్యాట్నీ  రోడ్స్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • వైఎంసీఏ సీటీవో ఫ్లై ఓవర్స్ పై వెహికల్స్ లకు పర్మిషన్ లేదు..ఈ ట్రాఫిక్ ఆంక్షను నగర వాసులు గమనించి ఆయా రోడ్స్ వెంట వెళ్లాల్సిందిగా నగర సీపీలు, నార్త్‌జోన్‌ డీసీపీ,ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకలకు హాజరయ్యే వీఐపీ పార్కింగ్‌ కోసం ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. వారికి కేటాయించిన పాస్‌ల ఆధారంగా పార్కింగ్‌ ఉంటుంది. అలాగే సాధారణ ప్రజల వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.

  • ఏఏ, ఏ1, బి1 కారు పాసులున్న వారు బేగంపేట వైపు నుంచి రసూల్‌పురా జంక్షన్‌, సీటీఓ ఫ్లైఓవర్‌ వైపు వెళ్లాలి. అవే పాస్‌లతో అప్పర్‌ ట్యాంక్‌బండ్‌, రాణిగంజ్‌ నుంచి వచ్చే వారు ఎంజీరోడ్‌/పార్క్‌లేన్‌ వైపు వెళ్లాలి. అక్కడి నుంచి సెంట్రల్‌ టెలిగ్రాఫ్‌ ఐలాండ్‌, ప్లాజా జంక్షన్‌ల మీదుగా సర్దార్‌పటేల్‌ రోడ్‌ నుంచి పరేడ్‌గ్రౌండ్‌ చేరుకోవాలి.
  • కంటోన్మెంట్‌ నుంచి వచ్చే వారు టివోలి, ప్లాజాల నుంచి ఎడమవైపు తిరిగి వాహనాలను పార్క్‌ చేయాలి. కార్లలో ఉన్న అతిథులను దింపిన తర్వాత వారికి కేటాయించిన పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలను పార్క్‌ చేయాలి.
  • ఏఏ కారు పాసులున్న వారు అతిథులను మెయిన్‌ గేట్‌ వద్ద దింపి ఎస్‌పీరోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీఐపీ పార్కింగ్‌ ఏరియాలో వెహికల్స్ ను పార్క్ చేయాలి. 
  • ఏ1 కారు పాసులున్న వారు అతిథులను ఏ1 గేటు వద్ద దింపిన తర్వాత జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌ కింద పార్క్‌ చేయాలి.
  • బి1 కారు పాసులున్న వారు బి1 గేటు వద్ద అతిథులు దిగిన తర్వాత చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయం, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ వద్ద పార్క్‌ చేయాలి.
  • ఏ2 కారు పాసులున్న వారు ఎంజీరోడ్‌, బేగంపేట్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ వైపు నుంచి వచ్చేవారు జింఖానా గ్రౌండ్‌లో అతిథులను దింపి అక్కడే వాహనాలను పార్క్‌ చేయాలి.
  • బి2 పాసులున్న వారు ఆర్‌పీ రోడ్‌, ఎస్‌బీహెచ్‌ క్రాస్‌ రోడ్స్‌ నుంచి పరేడ్‌గ్రౌండ్‌ తూర్పు గేటు వరకు వచ్చి అక్కడి నుంచి కుడివైపు తిరిగి చీఫ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయం వద్ద అతిథులను దింపి వాహనాలను పార్క్‌ చేయాలి.
  • పాస్‌లు లేకుండా వచ్చే కార్లతోపాటు బైక్‌లు, ఇతర వాహనాలు లాంబా థియేటర్‌ వద్ద సిద్ధాంతి కాలేజ్‌ లేన్‌లో పార్క్‌ చేయాలి.
  • కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏఏ, ఏ1, బీ1 కారు పాసులున్న వారు ఎస్‌పిరోడ్‌ ద్వారా, ఏ2 కారు పాసులున్న వారు టివోలి క్రాస్‌ రోడ్స్‌ వైపు, బి2 కారు పాసులున్న వారు ఎస్‌బీహెచ్‌ జంక్షన్‌ వైపు నుంచి బయటకు వెళ్లాలి.
  • ఉదయం 7 నుంచి ఉదయం 10.30 గంటల వరకు ఎస్‌పీ రోడ్‌ (సిటీఓ- వైఎంసీఏ మధ్య) వన్‌వేగా పరిగణిస్తారు. వాహనాలకు సీటీఓ జంక్షన్‌ నుంచి వైఎంసీఏ వైపు మాత్రమే అనుమతి ఉంటుంది.
  • సాధారణ ప్రజల వాహనాలను లాంబా థియేటర్‌ వీధిలో పార్క్‌ చేయాలి.
  • పాసులున్న వారు తమ వాహనాలపై అద్దం ఎడమ వైపు కనిపించే విధంగా వాటిని అతికించాలి.