హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనం వేడుకలకు RSS చీఫ్ హాజరు 

  • Publish Date - September 10, 2019 / 06:05 AM IST

హైదరాబాద్‌ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు వీధి వీధినా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసిన గణనాథుడు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. దేశ వ్యాప్తంగా హైదరాబాద్ లో గణనాథుడు వేడుకలు ప్రత్యేకతే వేరు. పది రోజుల పాటు ప్రజలతో పూజలందుకున్న గణనాథులు ఆఖరి రోజు అంటే సెప్టెంబర్ 12న ఆఖరి పూజలందుకు నిమజ్జనానికి తరలనున్నారు. హైదరాబాద్ లో బాలాపూర్ గణేషుడి మరింత ప్రత్యేకంగా పూజలందుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట మరింత ప్రత్యేకం. 

ఈ క్రమంలో బాలాపూర్ లడ్డూ వేలం అనంతరం సెప్టెంబర్ 12న గణేషుడు శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభం కానుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ తెలిపింది. ఈ కార్యక్రమానికి RSS చీఫ్ మోహన్ భగవత్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొంటారని  సమితి సభ్యులు తెలిపారు. ఆయనతో పాటు స్వామి ప్రజ్ఞానంద శోభాయాత్రలో పాల్గొంటారని తెలిపింది.

బాలాపూర్ లడ్డూ వేలం అనంతరం ప్రారంభమయ్యే గణేషుడు శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, శాలిబండ, చార్మినార్‌ మీదుగా కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా ప్రతీ సంవత్సరం డీజేలు, సినిమా పాటలు ఉండకుండా చూడాలనీ..దాని స్థానంలో దేశభక్తి,  దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు వంటివి ఉండేలా చూడాలని ఉత్సవ కమిటీ సభ్యులు ఆదేశించారు. 

ప్రతీ సంవత్సరాం ఓ థీమ్ పెట్టుకుంటున్నట్టుగానే ఈ సంవత్సరం జలియన్‌ వాలాబాగ్‌లో జరిగిన ఘటనను మననం చేసుకుంటూ ఊరేగింపు సాగాలని సూచించారు. కాగా గణేషుడి శోభాయాత్రకు ఈ సంవత్సరం 40 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారనీ పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీ నిఘాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు