డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు 

హైదరాబాద్ లో ఓ ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. సికింద్రాబాద్ సమీపంలో డివైడర్ పై నుంచి దూసుకెళ్లి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. 

  • Publish Date - November 24, 2019 / 07:35 AM IST

హైదరాబాద్ లో ఓ ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. సికింద్రాబాద్ సమీపంలో డివైడర్ పై నుంచి దూసుకెళ్లి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. 

హైదరాబాద్ లో ఓ ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. సికింద్రాబాద్ సమీపంలో డివైడర్ పై నుంచి దూసుకెళ్లి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం(నవంబర్24, 2019) ఉదయం సికింద్రాబాద్ నుంచి బయల్దేరింది. చింతల్ లోని షా థియేటర్ దగ్గర ప్రమాదానికి గురైంది. 

రోడ్డు మధ్యలో నిలిపి ఉన్న ఆటోను తప్పించబోయిన క్రమంలో బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లి..విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. దీంతో అక్కడ కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.